NLR: ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు సోమశిల జలాశయానికి వరద నీరు చేరుతోంది. ప్రాజెక్ట్ పూర్తి సామర్థ్యం 77.98 టీఎంసీలు. జలాశయం నిండిన తర్వాత ఒకేసారి నీటిని విడుదల చేయకుండా.. ముందస్తు ప్రణాళికలో భాగంగా కొంతమేర నీటిని విడుదల చేస్తామని సీఈ వరప్రసాద్ వెల్లడించారు. ప్రస్తుతం జలాశయంలో 71 టీఎంసీల నీరు ఉండగా.. ప్రాజెక్టుకు ప్రమాదం లేదని ఆయన స్పష్టం చేశారు.