CTR: రొంపిచర్ల మండలం ఎలకటూరివారి పల్లి వెళ్లే రోడ్డు వర్షాలకు బురదమయమైంది. ఈ మార్గంలో ద్విచక్ర వాహనాలు రాకపోకలకు ఇబ్బందికరంగా మారింది. వాహనాలు బురదకు అదుపుతప్పి పడిపోతున్నారు. ప్రతి పల్లెకు తారు, సిమెంటు రోడ్లు ఉన్న ఈ గ్రామానికి మాత్రం రోడ్డు వసతి లేదని ప్రజలు విచారం చెందుతున్నారు. అధికారులు,ప్రజా ప్రతినిధులు చర్య తీసుకొని రోడ్డు వేయాలని కోరుతున్నారు.