SRPT: తుంగతుర్తి మండలం కరివిరాలలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో కార్తీక మాస పూజలు ఆలయ అర్చకులు ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే భక్తులు కార్తీక స్నానాలు చేసి, స్వామివారిని దర్శించుకునేందుకు భారీగా తరలివచ్చారు. ఆలయ అర్చకులు వాస్తు మాధవ్ ఆధ్వర్యంలో భక్తులచే ప్రత్యేక పూజలు నిర్వహించారు.