KDP: పులివెందుల మున్సిపాలిటీ పరిధిలో వెంకటాపురం కాలనీవద్ద కొన్ని రోజులుగా డ్రైనేజ్ లైన్ దెబ్బతినడంతో మురికినీరు రోడ్డపై పొంగి పొర్లుతోంది. దీనిపై మున్సిపల్ కో-ఆప్షన్ మెంబర్ దాసరి చంద్రమౌళి స్పందించి మంగళవారం పొంగిపొర్లుతున్న డ్రైనేజ్ నీళ్లను శుభ్రం చేయించారు. సమస్య పరిష్కరంపట్ల స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు.