ముంబైలోని ఓ భవనంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో చిన్నారి సహా నలుగురు మృతి చెందారు. మరో పది మందికి తీవ్ర గాయలవడంతో ఆస్పత్రికి తరలించారు. మరోవైపు వాషీ సెక్టార్-14లోని మరో భవనంలో అగ్ని ప్రమాదం జరిగింది. దీంతో వెంటనే అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది 5 గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ఘటనలో పలువురు గాయపడినట్లు అధికారులు తెలిపారు.