కోనసీమ: పి.గన్నవరం మండలం ఊడిమూడిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. భార్యను భర్త కత్తితో పొడవడంతో ముఖంలో దిగబడిపోయి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. స్థానికులు ఆమెను 108 అంబులెన్స్‌లో అమలాపురం ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి, వైద్యం అందిస్తున్నారు. ఈ ఘటనపై పి. గన్నవరం పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా.. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.