JGL: భారత్ సురక్ష సమితి ఆధ్వర్యంలో పోలీసు అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా అమరవీరుల విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సమితి నాయకులు మాట్లాడుతూ.. దేశ భద్రత, సమగ్రత, సమైక్యతకోసం అసువులు బాసిన పోలీసు సిబ్బందికి దేశం తరఫున అంకిత భావంతో ఘననివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ కౌన్సిలర్ ACS రాజు తదితరులు పాల్గొన్నారు