దీపావళి పండుగ సందర్భంగా భారతీయ స్టాక్ మార్కెట్లలో ఇవాళ ‘మూరత్ ట్రేడింగ్’ ప్రారంభమైంది. ఈ క్రమంలో దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 121.30 పాయింట్లు లాభపడి 84,484.67 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 58.05 పాయింట్ల లాభంతో 25,901.20 దగ్గర కొనసాగుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 88.02గా ఉంది.