TG: హైదరాబాద్ జూబ్లీహిల్స్లో RRR రైతులు ఆందోళన చేపట్టారు. RRR అలైన్మెంట్ ఇష్టానుసారంగా చేశారని.. తమ కడుపుకొట్టొద్దంటూ రైతులు నిరసన చేస్తున్నారు. దీంతో ఆర్వో ఆఫీసు దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. ‘మా సత్తా చూపేందుకే ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్నాం. ఎన్నికల అధికారులు సహకరించడం లేదు’ అని పేర్కొన్నారు.