BDK: భద్రాచలం శ్రీ చిన్న జీయర్ స్వామి మఠంలో త్రిదండి చిన్న జీయర్ స్వామి పుట్టినరోజు వేడుకలు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఇవాళ నిర్వహించారు. ఎమ్మెల్యే తెల్లం వెంకట్ రావు పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. భద్రాచలం పట్టణంలో లయన్స్ క్లబ్ చేస్తున్న పలు సేవా కార్యక్రమాలను కొనియాడారు. అనంతరం మహిళలకు వస్త్రాలు పంపిణీ చేశారు.