కృష్ణా: అవనిగడ్డలో ఉమ్మడి రాష్ట్ర మాజీ మంత్రి, దివిసీమ గాంధీ స్వర్గీయ మండలి వెంకట కృష్ణారావు శత జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఏసుబాబు, పీఏసీఎస్ ఛైర్మన్ నాదెళ్ల శరత్ చంద్రబాబు, నాయకులతో కలిసి ఆయన విగ్రహానికి పూలమాలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్ర అభివృద్ధికి అనేక సంస్కరణలు ప్రవేశపెట్టిన ఘనత కృష్ణారావుకే దక్కిందన్నారు.