AP: తిరుమల తిరుపతి దేవస్థాన ట్రస్టులకు భారీగా విరాళాలు వచ్చాయి. 11 నెలల్లో రూ.918.6 కోట్లు (2024 నవంబర్ 1 నుంచి-2025 అక్టోబర్ 16 వరకు) వచ్చినట్లు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు వెల్లడించారు. విరాళాలతోపాటు పలు నిర్మాణాలు, యంత్రాల కొనుగోలు, సాంకేతిక అభివృద్ధికి దాతలు సహకారం అందిస్తున్నట్లు చెప్పారు. అత్యధికంగా ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు రూ.338.8 కోట్లు వచ్చిందన్నారు.