కృష్ణా: మొవ్వ మండలం చినముత్తేవి గ్రామంలో ట్రంప్ సుంకాల పెంపుకు నిరసనగా, ఏపీ రైతు సంఘం, కౌలు రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం సంయుక్త పిలుపు మేరకు సోమవారం రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కార్మికులు గ్రామ సెంటర్లో ట్రంప్ ఫ్లెక్సీలను దగ్ధం చేశారు. అనంతరం ట్రంప్ విధానాలు నశించాలి, రైతులపై భారం తగ్గించాలి అని నినాదాలు చేశారు.