JGL: కోరుట్ల నుంచి అరుణాచల గిరి ప్రదక్షిణకు ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సును ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ మనోహర్ తెలిపారు. నవంబర్ 3న సాయంత్రం 4 గంటలకు కోరుట్ల నుంచి బస్ బయలుదేరి కాణిపాకం, గోల్డెన్ టెంపుల్ దర్శనం అనంతరం 5న అరుణాచలం చేరుకుంటుందన్నారు. గిరి ప్రదక్షిణ అనంతరం బయలుదేరి 6న మహానంది, జోగులాంబ దర్శనాల తర్వాత తిరిగి కోరుట్ల వస్తుందన్నారు.