WGL: మావోయిస్టు ప్రతినిధి జగన్ పేరిట విడుదలైన లేఖలో మల్లోజుల వేణుగోపాల్, తక్కళ్లపల్లి వాసుదేవరావు ముఠా వల్ల పార్టీకి నమ్మకద్రోహం జరిగిందని పేర్కొన్నారు. వీరి మాయమాటలు నమ్మి కొందరు కామ్రేడ్లు వీరి వెంట వెళ్లారని తెలిపారు. విప్లవోద్యమానికి నష్టం చేసిన ఈ ముఠాలకు శిక్ష తప్పదని, అమరుల త్యాగాల సాక్షిగా శపథం చేస్తున్నామని హెచ్చరించారు.