SRD: పేకాట ఆడుతున్న 10 మంది పై కేసు నమోదు చేసినట్లు సిర్గాపూర్ ఎస్సై మహేష్ సోమవారం తెలిపారు. కడ్పల్ శివారులోని ఓ కోళ్ల ఫారంలో రహస్యంగా పేకాట ఆడుతున్నారని విశ్వసనీయ సమాచారం తెలవగానే తమ సిబ్బందితో కలిసి వెళ్లి స్థావరంపై దాడి చేసినట్లు చెప్పారు. వారి వద్ద నుంచి నగదు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశామన్నారు. వీరిని కోర్టు లో హాజరు పరుస్తామన్నారు