MHBD: దీపావళి పండుగ నేపథ్యంలో తొర్రూరు డివిజన్ కేంద్రంలోని పెద్ద చెరువు వద్ద టపాసుల దుకాణాలు ఏర్పాటు చేశారు. సోమవారం తొర్రూరు చుట్టుపక్కల గ్రామాల నుంచి యువతీ, యువకులు, చిన్న పిల్లలు భారీగా తరలివచ్చి టపాసులు కొనుగోలు చేయడంతో సందడి వాతావరణం నెలకొంది. దీంతో దుకాణ సముదాయాలు జనంతో కిక్కిరిసిపోయాయి.