వనపర్తి జిల్లాలోని ఇర్ఫాని దర్గా వద్ద ఉర్సు ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ముగింపు వేడుకల్లో భాగంగా స్థానిక శాసనసభ్యులు మేఘారెడ్డి హాజరయ్యారు. ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. భక్తులతో పాటు జిల్లా ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరారు. పెద్ద ఎత్తున భక్తులు హాజరై మొక్కులను తీర్చుకున్నారు. అనంతరం అన్న వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు.