కృష్ణా: మోపిదేవిలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని రాష్ట్ర ఇన్ఫర్మేషన్ కమిషనర్ ఏ.ఉదయ భాస్కర్ రెడ్డి బుధవారం దర్శించుకున్నారు. నాగపుట్టలో పాలు పోసి శ్రీ స్వామి వారిని దర్శించుకుని ఆలయ అర్చకులచే పూజలు జరిపించుకున్నారు. ఉదయ భాస్కర్ రెడ్డి కుటుంబ సభ్యులను ఆలయ మర్యాదలతో ఆలయ సూపర్డెంట్ అచ్యుత మధుసూదనరావు సత్కరించి, ప్రసాదాలను అందజేశారు.