NDL: శ్రీశైలానికి చెందిన భాగ్యమ్మ అనారోగ్యంతో బ్రెయిన్ డెడ్ అయ్యారు. కుటుంబ సభ్యులు ఆమె అవయవాలను దానం చేశారు. ఈ అవయవాలతో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న నలుగురు తమ జీవిత నిలబెట్టుకున్నారు. ఆమె గుండెను సేకరించిన కర్నూలు కిమ్స్ వైద్యులు వెంటనే చెన్నైకి బయలుదేరారు. అవయవ దానంతో మానవత్వం చాటుకున్న ఆమె కుటుంబ సభ్యులను స్థానికులు ప్రశంసించారు.