KMR: విలువిద్య క్రీడాకారులు జాతీయస్థాయిలో రాణించాలని దోమకొండ ఎస్సై లావణ్య సూచించారు. బుధవారం దోమకొండ గడి కోటలో జిల్లా స్థాయి విలువిద్య పోటీలు నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో ఎంతో మంది క్రీడాకారులు ఉన్నారని గుర్తు చేశారు. వారి ప్రతిభను బయటకు తీసుకు రావలసిన అవసరం ఎంతైనా ఉందని సూచించారు. గెలుపు ఓటములను సమానంగా తీసుకోవాలని సూచించారు.