సంగారెడ్డి మండలం ఫసల్వాదిలోని శ్రీ గురుదత్త ఆశ్రమంలో విశేష భస్మాభిషేకం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆశ్రమ వ్యవస్థాపకులు మహేశ్వర శర్మ సిద్ధాంతి ఆధ్వర్యంలో ద్వాదశ జ్యోతిర్లింగాలకు ప్రత్యేక అభిషేక పూజలు నిర్వహించి, భక్తి గీతాలాపనలతో కార్యక్రమాలను కొనసాగించారు. ఇందులో చుట్టుపక్క ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి భస్మాభిషేకంలో పాల్గొన్నారు.