కృష్ణా: సీపీఎం ఆధ్వర్యంలో మాదలవారిగూడెం, సూరంపల్లి, గన్నవరం గ్రామాలలో ట్రంప్ శుంకాలకు వ్యతిరేకంగా సోమవారం విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. గ్రామాల్లో కరపత్రాలు పంపిణీ చేసి, గ్రూపు మీటింగ్ల ద్వారా ప్రజలకు ఈ నిర్ణయాల వల్ల కలిగే ప్రభావాలను వివరించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం మండల నాయకులు కళ్ళ వెంకటేశ్వరరావు, మల్లంపల్లి ఆంజనేయులు, తాతబ్బాయి పాల్గొన్నారు.