VZM: ఈ నెల 21 పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ ఆదేశాలతో డెంకాడ పోలీసు స్టేషన్ పరిధిలో భారీ ఫ్లెక్సీలను స్థానిక ఎస్సై సన్యాసినాయుడు, సిబ్బందితో సోమవారం ఏర్పాటు చేశారు. పోలీసు చేసిన త్యాగాలను ప్రజలకు అవగాహన కలిగించేందుకు ముఖ్యమైన కూడలిలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు.