గద్వాల మండలం తుర్కోనిపల్లికి చెందిన కాంగ్రెస్ నాయకులు రమేష్, శ్రీనివాస్ రెడ్డి, కృష్ణ, సురేష్ తదితరులు సోమవారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. గద్వాల ఇన్ఛార్జ్ బాసు హనుమంతు నాయుడు తన నివాసంలో వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు లక్ష్యంగా కృషి చేయాలని హనుమంతు నాయుడు వారిని కోరారు.