MNCL: ప్రాణహిత నదిలో గల్లంతైన కోటపల్లి మండలం రొయ్యలపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ యువ నాయకుడు దాగామ శ్రీశైలం కోసం ఎస్సై రాజేందర్ ఆధ్వర్యంలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. దీపావళి పండుగ సందర్భంగా గ్రామంలో రామాయణం నాటకం ఆడటానికి ఆలుగామ గ్రామ సమీపంలోని ప్రాణహిత నదిలో స్నానం చేస్తుండగా శ్రీశైలం గల్లంతయ్యాడు.