ADB: ఉట్నూర్ పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా మండలంలోని అంబేడ్కర్ చౌక్‌లోని అమరులకు పోలీసులు ఘనంగా నివాళులర్పించారు. దేశ శాంతిభద్రతల కోసం ప్రాణత్యాగాలు చేసిన పోలీసు యోధుల సేవలు ఎప్పటికీ మరువలేమని ఈ సందర్భంగా అధికారులు పేర్కొన్నారు. పోలీసు సిబ్బంది, విద్యార్థులు 2 నిమిషాలు మౌనం పాటించి సంతాపం ప్రకటించారు.