NRML: అడ్వకేట్ ఫోరం ఉపాధ్యక్షుడిగా సురేష్ తెలంగాణ స్టేట్ అడ్వకేట్ ఫోరం ఉపాధ్యక్షులుగా ఖానాపూర్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు మంత్ర రాజం సురేష్ ఎంపికయ్యారు. దీంతో ఖానాపూర్ కోర్టుకు చెందిన పలువురు న్యాయవాదులు మంగళవారం ఆయనను కలిసి అభినందించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు షబ్బీర్ పాషా, షేక్ ఖాదిర్, అశోక్ తదితరులు ఉన్నారు.