BDK: అమర వీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా మంగళవారం జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ హేమచంద్రాపురంలో పోలీస్ అమరవీరుల స్మృతి పరేడ్లో జిల్లా ఎస్పీ రోహిత్ రాజు, కలెక్టర్ జితేష్ బీ పాటిల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలీస్ అమరవీరులకు వారు నివాళులర్పించారు. వారి త్యాగాలు నేటి తరానికి చిరస్మరణీయమని ఎస్పీ తెలిపారు. నేటి సమాజంలో పోలీసుల పాత్ర కీలకమని అన్నారు.