భూపాలపల్లి మున్సిపాలిటీ అభివృద్ధికి CM రేవంత్ రెడ్డి ప్రభుత్వం రూ.50 కోట్లు మంజూరు చేసింది. ఈ సందర్భంగా ఇవాళ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు స్థానిక నేతలతో కలిసి సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా MLA మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వంలో భూపాలపల్లి జిల్లా వేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు.