BDK: కరకగూడెం మండలంలోని కొత్తగూడెం గ్రామానికి చెందిన శ్రీ తేజ డిగ్రీ చదువుతూ చదువుతో పాటు జాతీయ స్థాయి క్రీడల్లో రాణించింది. ఇటీవల ఒడిస్సా రాష్టంలోని భువనేశ్వర్‌లో జరిగిన జాతీయ స్థాయి అథ్లెటిక్స్‌లో సత్తా చాటి స్వర్ణ పథకం సాధించింది. మంగళవారం కరకగూడెం ఆటో యూనియన్ ఆధ్వర్యంలో శ్రీతేజను ఘనంగా సన్మానించారు. భవిష్యత్తులో మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.