దీపావళి సందర్భంగా భారతీయ స్టాక్ మార్కెట్లు నిర్ణీత వ్యవధిలో మాత్రమే ప్రారంభమవుతాయి. ఈ సమయంలో నిర్వహించే ప్రత్యేక ట్రేడింగ్ సెషన్‌ను ‘మూరత్ ట్రేడింగ్’ అంటారు. ఈ ట్రేడింగ్‌లో స్టాక్ కొనుగోలు చేయడం వల్ల ఏడాది పొడవునా లాభాలు వస్తాయన్న నమ్మకంతో మదుపరులు భారీ సంఖ్యలో పాల్గొంటారు. కాగా, ఇవాళ మధ్యాహ్నం 1:45 గంటల నుంచి 2:45 గంటల వరకు ఈ సెషన్ జరగనుంది.