కరీంనగర్ పట్టణంలోని మహాశక్తి దేవాలయంలో మంగళవారం భక్తుల పోటెత్తారు. దీపావళి పర్వదినం సందర్భంగా నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ ఆలయంలో లక్ష్మి కుబేర హోమము నిర్వహించారు. పూజలలో పాల్గొనేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రావడంతో ఆలయంలో సందడి వాతావరణం ఏర్పడింది. భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ అర్చకుల ఆశీర్వచనం తీసుకున్నారు.