ATP: జిల్లాలో 15 మంది పోలీసు కుటుంబాలకు కారుణ్య నియామక ఉత్తర్వులను కలెక్టర్ ఆనంద్ అందజేశారు. ఈ నియామకాలను ఎస్పీ జగదీష్ ప్రత్యేక చొరవతో భర్తీ చేశారు. ప్రాణ త్యాగం చేసిన పోలీసు కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని వారు తెలిపారు. అనంతరం డీఐజీ డా.షిమోసి, ఎస్పీ, కలెక్టర్ అమర వీరుల కుటుంబాలకు చెక్కులు అందజేశారు.