ADB: గుడిహత్నూర్ మండలంలోని ముత్నూర్ గ్రామ నాయకులు MLA అనిల్ జాదవ్‌ను MLA క్యాంపు కార్యాలయంలో మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన్ను శాలువాతో సత్కరించి దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా గ్రామంలోని పలు అభివృద్ధి పనులకు సంబంధించిన అంశాలపై చర్చించినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో BRS నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు.