VZM: రాజాం మండలం బోద్దాం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణ మీదగా వేసిన తాగునీటి పథకం పైప్ లైన్ శనివారం పగిలిపోయిన సంగతి తెలిసిందే. పైప్ లైన్ లీక్ అవడంతో అధికారులు స్పందించి మరమ్మతుల కోసం గుంత తవ్వి అలానే వదిలేసారు. తవ్విన గుంత నిండా నీళ్లు ఉండడంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.