ATP: కళ్యాణదుర్గం మండలం బోరంపల్లి వద్ద బీటీపీ కాలువ పనులను MLA అమిలినేని సురేంద్రబాబు పరిశీలించారు. ప్రభుత్వం నుంచి నిధుల మంజూరు ఆలస్యమైనా పనులు ఆగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కుందుర్పి బ్రాంచ్ కెనాల్, బ్రహ్మాసముద్రం మండలం వెస్ట్ కోడిపల్లి, బోరంపల్లి–దుద్దెకుంట మార్గంలో జరుగుతున్న పనుల పురోగతిని ఇంజనీర్లతో సమీక్షించారు.