BHPL: రేగొండ మండలం కోడవటంచలోని ప్రసిద్ధ శ్రీ లక్ష్మి నరసింహ స్వామి ఆలయంలో బుధవారం స్వాతి నక్షత్రం సందర్భంగా ప్రత్యేక పూజలు జరగనున్నాయని ఆలయ అర్చకులు ఇవాళ తెలిపారు. అయితే రేపు శ్రీ సుదర్శన-నరసింహ హోమం, స్వామివారి అభిషేకం, కళ్యాణం నిర్వహించనున్నారు. భక్తులు, గ్రామస్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఆలయ అధికారులు కోరారు.