KDP: వర్షాకాలంలో పశువులకు వ్యాధుల ముప్పు ఎక్కువగా ఉంటుందని,పశువుల పట్ల జాగ్రత్తలు వహించాలని పశు వైద్యాధికారి డాక్టర్ శివకుమార్ అన్నారు. మంగళవారం సిద్ధవటం మండలం భాకరాపేటలో ఆయన మాట్లాడారు. వర్షాకాలంలో గొంతువాపు, జబ్బవాపు వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉందన్నారు. ముందుగానే టీకాలు వేయించాలని తెలిపారు. ఆలస్యమైతే గంటల్లోనే ప్రాణాలు పోయే ప్రమాదం ఉందని ఆయన సూచించారు.