అనంతపురం జిల్లాలో సుమారు 650 ఎకరాల్లో సాగైన బంతిపూలకు మంచి దిగుబడులు వచ్చినప్పటికీ గిట్టుబాటు ధరలు లేక రైతులు నష్టాల్లో కూరుకుపోతున్నారు. గతేడాది కిలో రూ.100-120 ధర పలికిన బంతిపూలు, ఈసారి కిలో రూ.40-50కే పడిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. పండుగల కాలంలోనూ ధరలు పడిపోవడంపై రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.