E.G: ప్రజల శాంతిభద్రతల పరిరక్షణ పోలీసుల ప్రధాన కర్తవ్యమని కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. రాజమండ్రిలో జరిగిన పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవ పరేడ్లో ఆమె పాల్గొని, మాట్లాడారు. నేరాల నియంత్రణలో పోలీసులు చేస్తున్న కృషి ప్రశంసనీయమని పేర్కొన్నారు. కుటుంబాలకు దూరంగా ప్రజల భద్రత కోసం సేవలందిస్తున్న పోలీసు సిబ్బందిని అందరూ అభినందించాలని సూచించారు.