NZB: సాలూర మండల కేంద్రంలోని రైతు వేదికలో రబీ సాగుకు వ్యవసాయ శాఖ జాతీయ ఆహార భద్రత పోషకాహార మిషన్ ఆధ్వర్యంలో సబ్సిడీపై రైతులకు శనగ విత్తనాలు అందజేశారు. శనగ బ్యాగు ధర రూ.1,800 ఉండగా దీనిలో మొక్క ఎదుగుదలకు కావలసిన రసాయన, బయో ఎరువులు సైతం అందజేస్తున్నట్లు మండల వ్యవసాయ విస్తరణ అధికారి అపర్ణ తెలిపారు. రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.