SRD: కంగ్టి మండల కేంద్రంలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్లను ఎంపీడీవో సత్తయ్య, కార్యదర్శి సుభాష్‌తో కలిసి మంగళవారం పరిశీలించారు. గ్రామంలో మొత్తం 27 ఇళ్లు మంజూరు కాగా, 21 మంది ఇళ్ల నిర్మాణం పనులు చేపడుతున్నారని తెలిపారు. 19 మంది లబ్ధిదారులకు పునాది బిల్లులు చెల్లించినట్లు చెప్పారు. మరో 8 మందికి లెంటల్ లెవెల్, అలాగే ఇద్దరు స్లాబ్ పనులు చేపడుతున్నారన్నారు.