BHPL: దేశ భద్రత, ప్రజారక్షణ కోసం పోలీసులు చేస్తున్న సేవలు, త్యాగాలు చిరస్మరణీయమని MLA గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. మంగళవారం పోలీస్ అమరవీరుల దినోత్సవ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ కిరణ్ ఖరేతో కలిసి MLA గండ్ర పాల్గొన్నారు. MLA గండ్ర మాట్లాడుతూ.. పోలీసుల నిబద్ధతతోనే సమాజం స్వేచ్ఛగా, భయం లేకుండా జీవిస్తోందని, వారి సేవలు స్ఫూర్తిదాయకమని ఆయన పేర్కొన్నారు.