AKP: నర్సీపట్నం స్పీకర్ క్యాంప్ కార్యాలయంలో స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు కుటుంబ సభ్యులతో దీపావళి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దీపాల పండుగ ప్రతి కుటుంబంలో వెలుగులు నింపాలని, అందరూ సుఖసంతోషాలతో, ఆనందంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నాను. ప్రతి ఒక్కరిపై భగవంతుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకున్నారు.