VSP: ఆంధ్రయూనివర్సిటీ ఏఐఎస్ఎఫ్ కమిటీ ఆధ్వర్యంలో బస్సు యాత్ర గోడ పత్రికలను సోమవారం ఆవిష్కరించారు. రాష్ట్రవ్యాప్తంగా విద్యా సమస్యల పరిష్కారానికై ఇచ్చాపురం నుంచి హిందూపురం వరకు బస్సు యాత్ర నిర్వహిస్తున్నట్లు కార్యదర్శి జెట్టి అభిషేక్ తెలిపారు. 24న జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద, 25న గాజువాకలో బహిరంగ సభలు జరగనున్నాయి.