TPT: తుమ్మలగుంట గ్రామంలోని కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద దీపావళి పండుగ పురస్కరించుకొని నరకాసుర వధ ఘనంగా జరిగింది. ముందుగా ఆలయం వద్ద ఏర్పాటు చేసిన నరకాసురుడి బొమ్మకు తడా మాజీ ఛైర్మన్ మోహిత్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం నరకాసురుడి బొమ్మకు మంట వెలిగించి కాల్చివేశారు. గ్రామంలో గత 18 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం చేస్తున్నట్లు చెప్పారు.