KKD: కరప మండలం పెనుగుదురులో మంగళవారం ఎంపీడీవో సలాది శ్రీనివాసరావు పారిశుద్ధ్య పనులను తనిఖీ చేశారు. తడి, పొడి చెత్త సేకరణపై ప్రజల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. సంపూర్ణ పారిశుద్ధ్యం అమలు చేసి, ఆరోగ్యవంతమైన గ్రామంగా తీర్చిదిద్దేందుకు ప్రజలు సహకరించాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా ప్రజల సమస్యలను కూడా అడిగి తెలుసుకున్నారు.