NLG: మునుగోడు నియోజకవర్గంలో సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకే మద్యం దుకాణాలు తెరిచి ఉండాలని, పర్మిట్ రూంలు ఉండొద్దని ఎమ్మెల్లె రాజగోపాల్ రెడ్డి కండిషన్స్ పెట్టాడు. ఈ విషయంపై మంత్రి జూపల్లి ఇవాళ స్పందిస్తూ రాష్ట్రమంతా ఒకటే రూల్ ఉంటుంది, ఒక్కో నియోజవర్గానికి ఒక్కో రూల్ ఉండదు అంటూ వ్యాఖ్యలు చేశారు.