NTR: కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలోని చిల్లా రోడ్డులో గల ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులు డాక్టర్ల కోసం ఎదురుచూడక తప్పడం లేదు. మంగళవారం ఉదయం 10:30 గంటలు దాటినా వైద్యుడు అందుబాటులో లేకపోవడంతో రోగులు తీవ్ర అవస్థలు పడ్డారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఉదయం 9 గంటల నుంచే వైద్యుడు అందుబాటులో ఉండాల్సి ఉన్నా, 10:30 అయినా రాకపోవడం గమనార్హం.